గోనె శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీగా హాజరు.
ఉప్పల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం భాగ్యనగర్ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ప్రారంభం అయింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తులో బీజేపీ శ్రేణులు హాజరు అయ్యి విజయవంతం చేసారు. బీజేపీ చిల్కనగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కనగర్ నుండి భారీగా హాజరయారు. బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున చిల్కనగర్ శివాలయం దగ్గర నుండి ర్యాలీ గా బయలుదేరి బస్సులో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరు అయ్యారు.