- రెండు కళ్యాణ లక్ష్మిలు..ఇది నిజంగా గొప్ప విషయం..ఆఢభిడ్డల తల్లిదండ్రులకు గొప్ప సహాకారం..
- ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయని సాయం కేసీఆర్ మాత్రమే చేస్తుండు…
- ఇద్దరు కుమార్తెల వివాహాలు రెండు కల్యాణ లక్ష్మి చెక్కులు
- రెండు చెక్కులతో తల్లి ఆనందోత్సాహం
కరీంనగర్రూ: తెలంగాణ రాష్ట్ర, కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన చెంచాల మణెమ్మ సదయ్య దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. వారి పేర్లు. ఝాన్సీ – జోష్న. నిరుపేద కుటుంబమైనా ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇటీవలే ఇద్దరి వివాహాలు జరిపించారు. 2,00,232/- విలువైన రెండు కల్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న ఆ మాతృమూర్తి కళ్ళలో ఆనంద భాష్పాలు కనిపించాయి. వివరాల్లోకి వెళితే
ఈరోజు హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ చేతులమీదుగా వారి ఇద్దరు కుమార్తెల కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఆ చెక్కులను తీసుకున్న మణెమ్మ మురిసిపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనంద భాష్పాలు ఆమె కళ్ళల్లో కనిపించాయి. మా బాపు తెలంగాణ సీఎం కేసీఆర్ నాకు రెండు చెక్కులు పంపించాడు అంటూ అబ్బుర పడింది. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటాం కరోన కష్టకాలంలో ఇంత పెద్ద సహాయం చేయడం మా అదృష్టం.. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ సార్ కు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం అని ఆనందంతో చెప్పింది మణెమ్మ ..