బిసిలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా బలపడాలంటే బిసిల పితామహుడు శ్రీ బి.పి మండల్ గారు ప్రతిపాదించిన బిపి మండల్ కమిషన్ సిఫార్షులను అమలు చేయాలని బిసి దళ్ దుంద్ర కుమార స్వామి డిమాండ్ చేశారు .
బిహార్ ముఖ్య మంత్రిగా పని చేసిన బి.పి మండల్ గారు కేవలం 48 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని, రాజకీయ బెదిరింపులకు, పదవులకు తల వొగ్గకుండా బిసిల అభివృద్దికి ముఖ్యమంత్రి పదవినే వదిలేసిన బిసిల ఉక్కు మనిషి మండల్ గారు అని తెలిపారు. అటువంటి మహనీయుడు చేసిన సిఫార్షులను ప్రభుత్వాలు పెడ చెవిన పెట్టడం ఎంత వరకు సమంజసము అని కుమార స్వామి ప్రశించారు.
1977లో పార్లమెంటుకు ఎన్నికయిన మండల్ గారు అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఓబీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలు సూచించే విధంగా కమిటీని ఏర్పాటు చేసినారు. మండల్ కమిటీ నివేదికను అప్పటి హోంమంత్రి జ్ఞాని జైల్‌సింగ్‌కు డిసెంబర్ 31, 1980 నాడు మండల్ సమర్పించారు. మండల్ గారు దేశంలోని వివిధ ప్రాంతాలో పర్యటించి, ముఖ్యనేతలను, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు, విషయనిపుణులను సంప్రదించి అత్యంత సమగ్రమైన నివేదికను తయారు చేశారు . ఈ నివేదిక సమర్పించిన 15 నెలలకే 1982 ఏప్రిల్ 13న మండల్ కన్ను మూసినారు.
మండల్ సిఫారసులు అమలు చేయాలనే నిర్ణయం 1990లో జరిగినా అనేక కోర్టు అడ్డంకులెదుర్కొని 1993 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, 2008 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు అమలవుతున్నాయి. ఈ రిజర్వేషన్లు పొందడానికి క్రీమీలేయర్‌తో పాటు అనేక ఆంక్షలు ఉండడంతో ఇప్పటికీ ఓబీసీలకు సరైన న్యాయం జరగడం లేదు. 27 సంవత్సరాల నుండి రిజర్వేషన్లు అమలవుతున్నా ఇంకా కేంద్రంలో 10 శాతం కూడా ఓబీసీ ఉద్యోగస్తులు లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని అధిగమించడానికి మండల్ కమిషన్ చేసిన సిఫార్సులన్నింటినీ పూర్తిగా అమలు జరపాలి.
బిసిల అభ్యున్నతి కి చేసిన కమిషన్ సిఫార్షులను అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు భ్యపడుతున్నాయో, ప్రజలు ఆలోచించాలి అని చెప్పారు. దేశంలో సగ జనాభా ఉన్న బిసిలు రాజ్యాధికారం అభివృద్ది కోసం రెజెర్వేషన్లు అవసరము అని కుమార స్వామి తెలిపారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more