బోడుప్పల్: ఈరోజు బోడుప్పల్ నగర పాలక సంస్థ లోని 15వ డివిజన్ లోని టెలిఫోన్ కాలనీలో గౌరవ కార్మికశాఖా మాత్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు మరియు మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు పర్యటించి కాలనీలోని డ్రైనేజీ మరియు రోడ్డు సమస్యల పట్ల సానూకూలంగా స్పందించారు. అనంతరం బొల్లిగూడెం, మహాలక్ష్మి కాలనిలలో పర్యటించి పలు కబ్జాలకు గురి అయిన పార్కులపై వెంటనే చర్య తీసుకోవాలని కమీషనర్ గారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు,బోడుప్పల్ తెరాస అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి గారు, మరియు టి ఆర్ ఎస్ పార్టీ 15 వ డివిజన్ ఇంచార్జ్ తోటకూర రవీందర్ యాదవ్ గారు మరియు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, తెరాస సీనియర్ నాయకులు ,మున్సిపల్ అధికారులు,కాలనీ వాసులు పాల్గొన్నారు.