మల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, మల్లాపూర్ డివిజన్ నెహ్రూ నగర్ 1వ బ్లాక్, అశోక్ నగర్ లో మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రజల క్షేమమే – ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.
అశోక్ నగర్ లో 18 సంవత్సరాలు నిండిన వారందరు వాక్సినేషన్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మరియు రేపు రెండు రోజులు మాత్రనే ఈ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, అల్లాడి కృష్ణ యాదవ్, బుసాని రఘు, నాగారం చంద్రశేఖర్, ప్రవీణ్, దేరంగుల రమణ, కోమర్తి సైదులు, AMOH మైత్రి , శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ప్రభుత్వ ఆరోగ్య అధికారి పూజ తదితరులు పాల్గొన్నారు.