కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మెయిన్ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీరు నిలవకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ మరియు టీఎస్ఐఐసి, ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, రంగారెడ్డి నగర్ లలో ప్రధానంగా వరద నీరు నిలిచే నాలాలను టీఎస్ఐఐసి అధికారులతో పాటు ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తుండటంతో నాలాల ద్వారా ప్రవహించే నీరు ఎక్కడా నిలవకుండా అభివృద్ధి చర్యలు చేపట్టాలని టీఎస్ఐఐసి అధికారులకు సూచించారు. వరదనీరు సులువుగా ప్రవహించే విధంగా నాలాలలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వరద కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం కోట్ల నిధులు వెచ్చించి నాలాలను అభివృద్ధి పరుస్తోందని అన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నెలకొన్న వరద సమస్యలన్నిటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి శాశ్వత పరిష్కారం చూపుతుందని, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసి డిజెడ్ఎంఈ జ్యోతి, ప్రాజెక్ట్ ఇంజనీర్ విక్రమ్, ఐలా గాంధీ నగర్ చైర్మన్ పి.రాజం గౌడ్, సెక్రెటరీ స్వామి గౌడ్, వాటర్ వర్క్స్ జిఎం శ్రీధర్ రెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, ఏఈ ఆశ, స్థానిక డివిజన్ అధ్యక్షుడు గౌసుద్దిన్, వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, రహీమ్, కాప సుబ్బారెడ్డి, కార్తిక్ గౌడ్, సుధాకర్, సతీష్ గట్టోజి, అంజి, వేణు యాదవ్, లక్ష్మణ్, యాదిరెడ్డి, రషీద్, లక్ష్మణ్, సాయి, వెంకట్, బాలునేత, షకీల్, జ్యోతి, కరుణ తదితరులు పాల్గొన్నారు.