స్వశక్తిపై ఎదగాలనుకునే మహిళలకు అండగా శ్రీ మహిళా సంక్షేమ సంఘం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, ప్రముఖ సినీ నటులు సుమన్
శ్రీ మహిళా సంక్షేమ సంఘం ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటిషన్ శిక్షణ ఇవ్వనున్నారు. అమీర్ పేటలో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి, ప్రముఖ సినీ నటులు శ్రీ సుమన్ తల్వార్ హాజరయ్యారు. అద్భుతమైన శిక్షణ ఇచ్చి.. సొంతగా వ్యాపారం ప్రారంభించేలా మెలుకువలు అందించడం వంటి ఎన్నో విషయాలలో శిక్షణ ఇవ్వనున్నారు. పలువురు నిష్ణాతులతో క్లాసెస్ చెప్పించి.. ఉద్యోగ కల్పన లక్ష్యంగా వీరు తీర్చి దిద్దనున్నారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకొనేలా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.
నేడు మహిళలు వంటింటికి పరిమితి కాకుండా స్వసక్తితో ముందుకు ఎదగాలనే లక్ష్యంతో ఈ వేదికను తీర్చిదిద్దినందుకు నిర్వాహకులను అభినందిస్తున్నట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు. మహిళలను మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి, మెలకువలు నేర్పిస్తూ వృత్తిలో ఎదగడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయం. స్వశక్తితో మహిళలు ఎదగడానికి టైలరింగ్, బ్యూటీషియన్, ఇతర రంగాలలో శిక్షణ ఉచితంగా అందిస్తూ ఉన్నారని.. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు వాడుకోవాలని దుండ్ర కుమారస్వామి సూచించారు.
సినీ నటులు సుమన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. అయితే కొందరు మహిళలకు కష్టపడే శక్తి ఉన్నా.. ఏమి చేయాలో.. చేయకూడదో అనే డైలమాలో ఉంటారు. అలాంటి వారికి శ్రీ మహిళా సంక్షేమ సంఘం ద్వారా పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. వారిని తమ స్వశక్తితో ఎదిగేలా చేస్తుండడం అభినందనీయం.
ఆసక్తిగల మహిళలు దరఖాస్తులను పెట్టుకోవచ్చని.. 45 రోజులపాటు టైలరింగ్ విద్య కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ తరగతులు శ్రీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమీర్ పేట్ కార్యాలయం లో నిర్వహిస్తున్నారు. 45 రోజులపాటు టైలరింగ్ విద్య పూర్తి చేసుకున్న తర్వాత శిక్షణ పొందిన విద్యార్థినులకు, మహిళలకు బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్లు శ్రీ మహిళా సంక్షేమ సంఘం ద్వారా అందజేయనున్నారు. ఆసక్తి కలవారు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన ఆసక్తిగల మహిళలు, ఒంటరిగా నివసించే మహిళలు, స్వశక్తితో జీవించాలనుకునే మహిళలందరూ దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
శ్రీ మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళలకు చేయూతను ఇచ్చామని.. సొంత కాళ్లపై నిలబడడానికి దోహద పడ్డామని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడమే తమ లక్ష్యమని అన్నారు.