మాదారం: తెలంగాణ రాష్ట్రంలో నేను సైతం/ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధులు మరియు గ్రామల పెద్దలు, ప్రజలు, సహకారంతో, మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ గ్రామ ప్రధాన కూడళ్లలో మరియు 04 సిసి ఏర్పాటు చేయడం జరిగింది. సీఐ బాబు రావు, ఎస్ఐ మానసలు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ సర్పంచ్, మరియు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సిసి కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపినారు. గ్రామంలో రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయన్నారు. మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో కలసి గ్రామంలో పోలీస్ శాఖ తరపున ఏమైనా రక్షణ అవసరాలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే తెలపాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు బెల్ట్ షాపులు, గుట్కాలు, ఎవరైనా అమ్మితే మరియు గ్రామంలో పేకాట ఆడితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ 100 ఫోన్ చేసి సమాచారం అందిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.