- 12 గేట్లు 60 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో
- లోయర్ మానేర్ డ్యాం గేట్ల ఎత్తివేత
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో, రాజన్న సిరిసిల్లలోని లోయర్ మానేరు డ్యాం గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల నీటిమట్టం క్రమంగా పెరుగడంతో గేట్లను ఎత్తడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మానేర్ వాగు, ఎస్సారెస్పీ, మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి నీటి తాకిడి పెరగడంతో గేట్లు ఎత్తడం విషయమై అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో 11 వ గేట్ ని ఎత్తారు. గురువారం సాయంత్రం 5 నుంచి 16 నంబర్ల వరకు గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎల్ఎండిలో సాయంత్రం వరకు 22 టీఎంసీల నీరు ఉండగా లక్షా 20 వేల ఇన్ ఫో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి ఇన్ ఫ్లో ఆధారంగా గేట్ల ఎత్తడం, తగ్గించడం ఉంటుందన్నారు.
గత ఏడాది ఆగస్టు 22 న నీటిని విడుదల చేయగా ఈసారి నెల ముందే ఎల్ఎండీ నుంచి విడుదల చేశారు.