మియాపూర్, తొలిపలుకు; మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేరు వేరు ఘటనలో చైన్ స్నాచింగ్ తో పాటు వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డిసిపి శిల్పవల్లీ తెలిపారు.ఈ రెండు దొంగతనాలకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ మియపూర్ మయూరి నగర్ లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ ను ఓ గుర్తు తెలియని వ్యక్తి పల్సర్ బైక్ పై వచ్చి లాక్కుని వెళ్ళాడని మాకు పిర్యాదు రావడంతో మేము దర్యప్తు చేయగా అతను.ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లా కు చెందిన మలిశెట్టి నరేష్(35) గా మా దర్యాప్తులో తేలిందనీ తెలిపారు. అతను.క్రికెట్ బెట్టింగ్. తో పాటు చెడు అలవాట్లకు, జల్సాలకు బానిసై చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డ నిందితుడు నరేష్. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నరేష్ నడిపిన పుల్సర్ బైక్ సైతం గచ్చిబౌలి లో దొంగిలించినదిగ దర్యాప్తు లో తేలిందని తెలిపారు.ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ ఒకటో తారీఖున తన లారీ పోయిందని యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు లేబర్ గా పనిచేస్తున్న నార్ల మల్లేష్(32),ముడవత్ శ్రీను(32) ఇద్దరు కలిసి ఈ లారీ ని దొంగిలించారు.బాచూపల్లి లోని పార్కింగ్ ప్రదేశంలో ఈ లారీ ని ఉంచిన అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో కష్టడిలోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు తెలిపారు.నిందితుడు నార్ల మల్లేష్ పై వివిధ పోలీస్ స్టేషన్ ల పరిధిలో మొత్తం 11 చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు తెలిసిందన్నారు..పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 8 లక్షల విలువ చేసే లారీ నీ స్వాధీనం చేసుకునీ నిందితులను రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more