పీర్జాదిగూడ: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటైన లైన్స్ క్లబ్ ద్వారా లైన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాస్క్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్న స్వరాజ్ నగర్ కాలనీలో మరియు మేడిపల్లి లోని అమ్మఒడి అనాధ ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల కేశవనాదం గారు హాజరై పిల్లలకు మాస్కులు స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది