అల్లూరి విద్యనభ్యసించిన నర్సాపురం, రామచంద్రాపురం పాఠశాలలో విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయం
అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజుల పాటు స్థానిక ఆనం రోటరీ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు, లక్ష్మీ దంపతులను సంఘం ప్రతినిధులు “జీవిత సాఫల్య పురస్కారం”తో ఘనంగా సత్కరించి, cపట్టు వస్త్రాలు, జ్ఞాపికను అందజేశారు.దేవాంగ కార్పొరేషన్ తరఫున కొండపల్లి పట్టాభిరామారావు(పట్టియ్య), పుచ్చల రామకృష్ణలు, మాదేటీ రాజాజీ ఆర్ట్ అకాడమీ తరఫున వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మాదేటీ రవి ప్రకాష్ , ఉపాధ్యక్షుడు పి.ఎస్. రవికాంత్ సారథ్యంలో పడాల దంపతులను ఘనంగా సత్కరించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన పడాల రామారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవన గిరి స్వామీజీ తణుకు వెంకట్రామయ్య దంపతులను పడాల రామారావు స్మారక అవార్డు తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విద్యనభ్యసించిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టేలర్ హై స్కూల్, రామచంద్రపురం నేషనల్ హైస్కూల్ లో అల్లూరి నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేయాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వబ్బల రెడ్డి సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి యిళ్ళ శ్రీకాంత్, కోశాధికారి బళ్ళ శ్రీనివాస్( మయూరి శ్రీను), ఉపాధ్యక్షులు పుచ్చల రామకృష్ణ , దంతులూరి సుబ్బరాజు, ఆర్ .వి .ఎస్ .రాజు , కార్యదర్శులు పి.రమాదేవి (నెల్లూరు), వెల్లాల నాగార్జున,హర దీపక్, సీనియర్ జర్నలిస్టు పి. వి. సత్యనారాయణ (నర్సీపట్నం ), లక్కాకుల బాబ్జి, దాడి గోవిందరావు (కోటనందూరు),శ్యామల వరలక్ష్మి పాల్గొన్నారు.