Press note: 31-12-2021
**చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేస్తున్న పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం?
గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధాన్యముందో అందరికీ తెలిసిందే. ఓబీసీలను లెక్కించడం ద్వారా జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారు.. దశాబ్దాలుగా సంపదలో, విద్యలో, రాజకీయాలలో వాటా , భగస్వామ్య వివరాలపై స్పష్టత వస్తుంది.బడుగు బలహీన వర్గాల వాస్తవ లెక్కలు కేంద్ర ప్రభుత్వం తేల్చి తే విద్య ఉద్యోగాల్లో సరైన వాటా వస్తుందని దానివల్ల వెనుకబడిన బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని జాతీయ బిసి దళ్ అధ్యక్షులు దుంద్ర కుమార స్వామి తెలిపారు. కుల గణన పై కేంద్ర ప్రభుత్వం పై అనేక బీసీ సంఘాలు ఒత్తిడి తెచ్చినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం చాలా బాధాకరమని విచారణ తెలియజేశాడు.
జన గణ చేయడం వలన లెక్కలు స్పష్టంగా తేలితే తద్వారా రాజ్యంగ ఫలాలు అందరికీ సమానంగా లభిస్తాయి అని అది సాధించడానికి దేశంలోని అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలియచేశారు . బిసి ఓట్లు విలువైనవి కానీ వారి లెక్కలు విలువైనవి కావా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీల జనాభా లెక్కించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చింది అని తెలియజేశారు.బిసి కుల లెక్కలు తెలిస్తే వెనుకబడిన తరగతుల సామాజిక పరిస్థితులు బాగుపడితే రాజకీయంగా అభివృద్ధి జరిగితే ఎవరికి నష్టం అని ఆలోచించి లెక్కలు తీయడం లేదా ? ప్రతి ఒక సామాన్యుడు ఆలోచించాలి, బీసీ జనాభా లెక్కలు వాటి వివరాలు లేకపోవడం ద్వారా రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరి దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు అని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం ఒక సంతోషకరమైన చర్యగా చెప్పవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం కొంత విచారణకు గురి చేస్తున్న విషయం అని తెలిపార