నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్న మల్లు రవికి ఘన స్వాగతం పలికిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy)
కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లు రవికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానం నుండి మల్లు రవి (Mallu Ravi)పోటీ చేస్తూ ఉండడం ఎంతో గర్వకారణమని దుండ్ర కుమారస్వామి అన్నారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న మల్లు రవికి. (Mallu Ravi) దుండ్ర కుమారస్వామి గజమాలతో స్వాగతం పలికారు. ఎంతో మందికి అండగా నిలిచిన మల్లు రవికి టికెట్ ను కేటాయించి కాంగ్రెస్ అధిష్టానం గొప్ప పని చేసిందని.. ఆయనను నాగర్ కర్నూలు ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపిస్తారని దుండ్ర కుమారస్వామి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి కారణమవుతున్న కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్న మల్లు రవి.. బడుగు-బలహీన వర్గాలకు ఎంపీగా మరింత చేరువవుతారని ఆశిస్తూ ఉన్నామని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాలు బీసీ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.