- శైవ క్షేత్ర పిఠాధిపతులు శివ స్వామి చేతుల మీదుగా శంకు స్థాపన.
- దేవాలయాల పై దాడులు ఆపాలి.
- హాజరైనా ఫిర్జాదిగూడ ఉప్పల్ ప్రజా ప్రతినిధులు.
మేడ్చల్ : ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంగరంగ వైభవంగా సీత రామచంద్ర స్వామి దేవాలయ పుననిర్మాణం కోసమని భూమి పూజ నిర్వహించారు. ఇట్టి కారిక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయ వంతం చేసారు. భూమి పూజ కి ముందు మేడిపల్లి లోని హనుమాన్ దేవాలయం నుండి శోభాయాత్ర నిర్వహించారు ఇందులో ప్రజలు, అన్ని పార్టీలా నాయకులు పాల్గొని విజయవంతం చేసారు.
భారత ధర్మదేవత, శైవక్షేత్ర పీఠాధిపతులు (అమరావతి) పూజ్య శ్రీ శ్రీ శివ స్వామి వారి చేతుల మీదుగా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ అందరు కృషి చేయాలి. అందరు దైవ కారిక్రమాలకి సహకరించాలి అని కోరారు. పక్క రాష్టం ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు పెరిగాయి అని తీవ్రంగా కండించారు. ఇలాంటి దాడులు ఇక పైన అయినా మానుకోవాలి లేకపోతె తీవ్ర చెరియలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కారిక్రమానికి మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ nvss ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు