బొడుప్పల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ నియోజకవర్గ బొడుప్పల్ లో ఈరోజు 21 డివిజన్ పరిధిలోని సాయి భవాని నగర్ కాలనీలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ 100kv కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని కాలనీలలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేటట్లు చూడాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ను క్లీన్ గా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో AE బలరాం నాయక్, సహకార బ్యాంక్ డైరెక్టర్ జడిగే రమేష్, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలుగొండయ్యా , వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ రెడ్డి, బ్రాహ్మణ భవన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కాలనీవాసులు రాజారావు, యాదిరెడ్డి, అనిల్, శ్రీధర్, సూర్యనారాయణ, మహేశ్వర్,చారి, అంజి రెడ్డి, రవీందర్, సూరిబాబు, రాములు & తదితరులు పాల్గొన్నారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more