చిల్కనగర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, చిల్కనగర్ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మరియు చీఫ్ ఎంటరాలజిస్ట్ రాంబాబు మరియు రజని ఎల్బీనగర్ జూన్ ఎంటరాలజిస్ట్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ మాట్లాడుతూ..
చిల్కానగర్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి నోడల్ ఆఫీసర్ రాజ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ డిఈ నిఖిల్ రెడ్డి, DE చందన,వాటర్ వర్క్స్ జంగయ్య, హార్టికల్చర్ సూపర్వైజర్ నర్సింగ్ రావు, ఎంటమాలజీ AE నరేష్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ రాజు , తదితరులు పాల్గొన్నారు.