• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News India

దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషి

AdminbyAdmin
23/12/2017
inIndia, News, Politics
0
lalu convicted fodder scam

రూ.900 కోట్ల దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దీంతో ఆయన్ను కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించనున్నారు. ఇవాళ రాంచీలోని సీబీఐ స్పెషల్ జడ్జి ఈ కేసులో తీర్పును వెలువ‌రించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి మూడ‌వ తేదీన జైలు శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. డియోఘర్ ట్రెజరీ కేసులో నిందితునిగా ఉన్న బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం నిర్దోషిగా బయటపడ్డారు. దాణా కుంభకోణం కింద మొత్తం 5 కేసులు ఉన్నాయి. అందులో ఇవాళ డియోఘర్ కేసులో తీర్పును వెలువరించారు. మ‌రో 15 మందికి కూడా జ‌న‌వ‌రి 3నే శిక్ష‌ను ఖ‌రారు చేస్తారు.

ఏంటీ కుంభకోణం ?
బీహార్‌లో దాణా కోసం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. పశుసంవర్థకశాఖ పేరుతో ఆ మొత్తం సొమ్మును కాజేశారు. వివిధ జిల్లాల నుంచి ఆ అమౌంట్‌ను విత్ డ్రా చేశారు. రెండు దశాబ్ధాల పాటు లాలూ సీఎంగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. దాణా సరఫరా చేస్తున్నారని లేని కంపెనీలను సృష్టించి.. వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారు. తీర్పు సందర్భంగా ఇవాళ రాంచీలోని సీబీఐ కోర్టు ఆవరణకు భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. లాలూతో పాటు బీహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా, మరో 20 మంది కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. సీబీఐ స్పెషల్ జడ్జి శివపాల్ సింగ్ ఈ కేసులో తీర్పును వెల్ల‌డిస్తారు. చైబాసా ట్రెజరీ కేసులో లాలూ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే ఆ కేసులో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. 1997, అక్టోబర్ 27న దాణా కేసులో మొత్తం 38 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఇప్పటికే 11 మంది చనిపోయారు. మరో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. మరో ఇద్దరిని దోషులుగా తేల్చారు. అయితే ఇవాళ దాణా కుంభకోణంకు సంబంధించిన డియోఘర్ ట్రెజరీ కేసులో తీర్పును వెల్లడించారు. 1991 నుంచి 1994 మధ్య ఆ ట్రెజరీ నుంచి పశుదాణా కోసం రూ.89 లక్షల విత్‌డ్రా చేశారు. దాణా కేసులో ఇప్పటివరకు వేర్వేరు కోర్టుల్లో 500 మందిని దోషులుగా తేల్చారు. అందులో లాలూ కూడా ఒకరు. చైబాసా ట్రెజరీ కేసులో ఆయన్ను దోషిగా తేల్చారు. 2013, అక్టోబర్ 3న ఆ కేసులో కోర్టు లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లాలూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అది ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నది.

Tags: Fodder Scam
Admin

Admin

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
News

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

by Admin
07/05/2025
0

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...

Read more
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం”- వకుళాభరణం

30/04/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News