కర్నూలు లోని కొండారెడ్డి బురుజు సమీపంలో అదొక షాపింగ్ కాంప్లెక్స్. అదే అనంత కాంప్లెక్స్. ఇందులో బట్టల వ్యాపారాలతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది ఎప్పాటిలాగే షాపింగ్ కాంప్లెక్స్ నుండి చెత్త తీసుకెళ్తూ ఉన్నారు. దీనికి సంబందించించిన టాక్సును కట్టమని వారు అడుగగా షాపు యాజమాన్యాలు నిరాకరించాయి.
అయితే ఈ షాపు యజమానులు 4 నెలల నుండి చెత్త పన్ను కట్టడంలేదని, వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది బుధవారం నగరంలో ప్రోగైన చెత్తను తీసుకువచ్చి కాంప్లెక్స్ ముందు పోసి వెళ్ళారు.
నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన పనికి షాపు యజమానులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. నెలకు ఒక్కోషాపుకు రూ.200 చెత్తపన్ను తాము కట్టలేమని, కరోణా వల్ల తమ బిజినెస్‌లు అంతగా నడవడం లేదని చెబుతున్నారు. సాయంత్రం మున్సిపల్ కమీషనర్‌తో తాము వెళ్ళి చర్చిస్తామని చెప్పినా వినకుండా ఇలా చెత్త వేసి వెళ్ళారని వారు వాపోయారు.