Press note/09/11/2020
బహుముఖ ప్రజ్ఞాశాలి , సామాజిక కార్యకర్త తెలంగాణ బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి విజయ దశమి పురస్కారము అందుకున్నారు. హై ఒక్టన్ సేవ సంస్థ ఆధ్వర్యం లో సమాజం లో వివిధ విభాగాల్లో రాణించిన ప్రముఖులకు విజయ దశమి సంధర్భంగా విజయదశమి పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపి సముద్రాల వేణు గోపాల చారి , జస్టిస్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. బిసి ల అభివృద్దికై నిరంతరముగా కృషి చేస్తూ , అటు పత్రికా రంగం లో రాణిస్తున్న దుండ్ర కుమార స్వామి కి పలువురు వక్తలు ప్రశంచిచారు. బి.సి.ల అభ్యున్నతి కై నిరంతరం పరితపించే బి.సి.లకు విద్యా, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి మరియు సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకువచ్చి, నాయకత్వ లక్షణాలు పెంపొందించి, స్వయంగా న్యాయసహాయం, బి.సి.ల అభివృద్ది కై నిరంతరం పరితపించే బి.సి.లకు విద్యా, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధి మరియు సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకువచ్చి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో ఎయిడ్స్, కుష్టు రోగులను వైద్య సహాయం, ఆర్ధిక సహాయం అందించడం, నిరుపేద మహిళలకు టైలరింగ్ .ఎంబ్రాయిడరీ ల్లో శిక్షణ నిచ్చి వారికి కుట్టుమిషన్లు అందించడం, నిరుద్యోగ యువతకోరకు స్వయం ఉపాది రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు ‘కౌన్సిల్ అఫ్ హాన్సన్స్ సోషల్ వెల్ఫేర్ సంస్థ ద్వారా నిర్వహించి అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అవార్డు గ్రహీత దుం డ్ర కుమార స్వామి నేటి సమాజానికి ఆదర్శం అని పలువురు అభినందించారు.
సామాజిక చైతన్యానికి గళంతోపాటు కలం బలం కుడా అవసరమని భావించిన , అక్షరమే ఆయుధంగా మలచి స్వీయ సంపాదకీయంలో ‘తొలిపలుకు’ అనే శీర్షికను ఒక పక్షపత్రికను , ఇంగ్లీష్ లో . ది రిపబ్లిక్ వాయిస్ స్థాపించి వ్యాపారాపేక్ష లేకుండా స్వంతఖర్చులతోనే సామాజిక భాద్యతగా ఆ పత్రికను నడిపిస్తున్న ఉన్నత ,విలువలు కలిగిన లా లో పట్టభద్రుడు , ఫార్మా ల్లో మాస్టర్స్ చేసిన కుమార స్వామి మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ సంధర్భం గా కుమార స్వామి విజయదశమి అవార్డు అందుకుందున్నకు ఆనందంగా ఉందని , నిర్వహకులకు ధన్యవాదాలు తెలిపారు. సమాజ అభివృద్దికి నిరంతరం తన వంతు సహకారం, కార్యక్రమాలు ఉంటాయని ఈ సంధర్భం గా తెలిపారు.