తొలిపలుకు న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ పరిధిలోని గాయత్రీ నగర్ లోని వాటర్ టాంక్ పార్క్ లో 15 లక్షల వ్యయం తో చేపట్టిన సీనియర్ సిటిజెన్ కమ్యూనిటీ హాల్ పుట్టింగ్ ఫౌండేషన్ కాంక్రీటు పనులను కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గౌరవ ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావు చొరవతో ఈ కమ్యూనిటీ హాల్ సీనియర్ సిటిజన్స్ కొరకు నిర్మిచబోతున్నాము,ఈ నిర్మాణం పూర్తి అయ్యాక సీనియర్ సిటిజన్స్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్ని వసతులతో కూడిన సీనియర్ సిటిజెన్ కమ్యూనిటీ హాల్ ని నిర్మించాడనీతికి కృషి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావు, సీనియర్ సిటిజన్ వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, యూసుఫ్, కాశీనాథ్ చారి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గున్నారు.