చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో సోదరుడి వరుస అయ్యే వ్యక్తిని హతమార్చిన కేసులో నిందితుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు, వెంకటస్వామి వరుసకు సోదరులు అవుతారు. ఆంజనేయులు చేతబడి చేసి వెంకట్ స్వామి కుటుంబంలో మరణాలకు కారణమయ్యాడు వెంకటస్వామి గొడవ పెట్టుకునేవాడు. గొడవలు భరించలేక ఆంజనేయులు ఎన్నో ఏళ్ల క్రితం కూకట్‌పల్లికి వలస వచ్చి జీవిస్తున్నాడు. ఆంజనేయులు కొడుకు కృష్ణ అతడి నుండి చేతబడి విద్య నేర్చుకున్నాడని వెంకటస్వామి కుమారుడు నక్క చందు అనుమానం పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం చందు తన కూతురు ఫంక్షనుకు కృష్ణని ఆహ్వానించాడు. ఆ తర్వాత చందు కూతురు అనారోగ్యానికి గురవ్వడంతో, కృష్ణ వారిపై చేతబడి చేశాడని అనుమానం పెంచుకుని కృష్ణని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారం జనవరి 3వ తేదీన 10:30 కు కృష్ణ ఇంటికి వెళ్లిన చందు, అర్ధరాత్రి అయింది కాబట్టి నీతో ఉంటాను అంటూ అతని ఇంట్లో ఉండి పోయాడు. కృష్ణ నిదిరించాక ఇంట్లోని రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సంచిలో వేసి పెట్టుకొని తన పల్సర్ బైక్ పై తీసుకుని వెళ్లి నల్లచెరువు పారవేసాడు. చెరువులో మృతదేహం సమాచారంతో అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని డిసిపి తెలిపారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more