హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్ నగరంలోని జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…
70 ఏండ్లలో ఈ తెలంగాణ ప్రజలకు కరెంట్, తాగునీరు ఇవ్వలేని దౌర్బాగ్యం మీది. 24 గంటల కరెంట్ తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పింది.. అది తెలంగాణకు గర్వకారణం కాదా? అని కేటీఆర్ అడిగారు. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే.. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే బరాబర్ సమాధానం చప్తాం. కుక్క కాటు చెప్పు దెబ్బ తప్పదు. ఓపిక పట్టినం.. సైలెంట్‌గా ఉండే కొద్ది మాటలు ఎక్కువైతున్నాయి అని కేటీఆర్ మండిపడ్డారు.