- 22 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ ఆసుపత్రి ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

వేములవాడ: తెలంగాణ ధార్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లో అత్యాధునిక సదుపాయాలతో, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాంతీయ ఆసుపత్రిని, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కె. తారకరామారావు గారు ప్రారంభించారు.