ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు ‘క్రాక్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా?, గోపిచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా?, నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం.
టైటిల్ : క్రాక్
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
నటీనటులు : రవితేజ, శ్రుతీహాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కోమాకుల, వంశీ, రవి శంకర్, సప్తగిరి తదితరులు
నిర్మాణ సంస్థ : సరస్వతి ఫిలిం డివిజన్
నిర్మాత : ‘ఠాగూర్’మధు
దర్శకత్వం : గోపీచంద్ మలినేని
సంగీతం : తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేది : జనవరి 9, 2021
కథ
పోత రాజు వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు. బ్యాగ్రౌండ్ అని ఎవడైనా విర్రవీగితే చాలు వాళ్ల బరతం పడతాడు. ఇలా వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తనదైనశైలీలో సీఐ వీర శంకర్ వైరం పెట్టుకుంటాడు. వారిలో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. అతను అంటే చుట్టుపక్కల 20 ఊర్లకు భయం. అలాంటి వ్యక్తిపై వీరశంకర్ తిరుగుబాటు చేస్తాడు.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని పాత్రలు
తమన్ మ్యూజిక్
విలన్లకు, హీరోకి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
ఫస్టాఫ్ ఫ్యామిలీ సీన్స్