• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News Flash News

తెలంగాణలో కోవిడ్ ఔట్ పేషెంట్ సర్వీసులు ప్రారంభం

TP NewsbyTP News
06/05/2021
inFlash News, Government, News
0
తెలంగాణలో కోవిడ్ ఔట్ పేషెంట్ సర్వీసులు ప్రారంభం
  • దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కోవిడ్ ఔట్ పేషెంట్ సర్వీసులు ప్రారంభం
  • రేపటి నుండి రాష్ట్రం మొత్తం కోవిడ్ పేషంట్స్ గుర్తింపు కోసం ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటి సర్వే
  • రాష్ట్రంలో తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. నిరంతరం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది
  • కోవిడ్ లక్షణాలు ఉంటే టెస్ట్ రిజల్ట్ కోసం వేచి చూడకుండా డాక్టర్ సలహాతో చికిత్స మొదలుపెట్టాలి
  • సరైన సమయంలో లక్షణాలు గుర్తించి, చికిత్స మొదలుపెడితే ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాదు.
  • 18-44 ఏళ్ల వారికి ఇవ్వడానికి 3.4 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం కాగా కేంద్రం మే నెల మొత్తానికి కేవలం 3.9 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే కేటాయించింది

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలు, మార్గ నిర్దేశనం మేరకు ప్రభుత్వ యంత్రాంగం కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, డిఎం & హెచ్.ఓ.ల తో టెలీ-కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మీడియా తో మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ప్రతి రోజు నిరంతరం ఆదేశాలు జారీ చేస్తున్నారని, అవసరమైన నిధుల ఖర్చుకు ఆదేశాలు జారీ చేశారని. అవసరమైన మందులు, కిట్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరారు. రాష్ట్రంలో కోవిడ్ కు నియంత్రణలో ఉందని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సి లు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానాలలో కోవిడ్ O.P. (Out Patient) ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ లక్షణాలు వున్నట్లు అనిపించిన వెంటనే మందుల వాడకాన్ని ప్రారంభించాలని, మెడికల్ కిట్లను వినియోగించాలని , 4,5 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గక పోతే, కిట్ లో వున్న ప్రత్యేక మందులు వాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.

జి.హెచ్.యం.సి తరహా లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో ప్రతి 1000 జనాభాకు ఒక టీం, ప్రజల ఇండ్ల వద్దకు వెళ్లి అవుట్ రీచ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. లక్షణాలు వున్న ప్రజలకు అక్కడిక్కడే మెడికల్ కిట్లను అందచేస్తారని అన్నారు. ఈ టీంలు వారి ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తాయని అన్నారు.

అన్ని శాఖల అధికారులు, ఒక టీం వర్క్ లాగా పనిచేసి కోవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నారని, గత వారం రోజుల ట్రేండ్ ను పరిశీలిస్తే తగ్గుదల కనిపిస్తున్నదని, ప్రజలలో విశ్వాసం పెరిగేలా మీడియా కృషి చేయాలని కోరారు.

ICMR గైడ్ లైన్స్ ప్రకారం లక్షణాలు కన్పించిన వెంటనే మందుల వినియోగం ప్రారంభించటం వల్ల ఆసుపత్రులలో చేరే అవకాశాలు తగ్గుతాయన్నారు. చికిత్సను జాప్యం
లేకుండా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా నియమకాల ప్రక్రియ ను చేపడుతున్నామన్నారు. ఆసుపత్రులలో పడకల సంఖ్యను పెంచామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పడకల సంఖ్యను 18 వేల నుండి 52 వేలకు పెంచామన్నారు. ఆసుపత్రులలో పరిశుభ్రతతో పాటు తగినంత వెలుతురు ఉండడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియమకాలకు కలెక్టర్లకు అనుమతినిచ్చామన్నారు. ఆక్సిజన్ ను వృధా చేయకుండా, ఆసుపత్రులలో ఆడిట్ తో పాటు అధికారులు, టీం లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసామన్నారు. ఆక్సిజన్ ను అవసరమైన మేరకే వాడుకోవాలని, రాష్ట్ర అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేసేలా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామన్నారు. డీలర్లు , సరఫరా దారులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే మొదటి సారిగా రవాణలో జాప్యాన్ని నివారించడానికి వాయుమార్గం ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపామని, ఇప్పటివరకు 14 ట్రిప్పుల ద్వారా 48 ట్యాంకర్లు పంపామని , రైల్వే ర్యాక్ లు కూడా వినియోగించామని తెలిపారు.

45 సంవత్సరములు పై బడిన వారికి వ్యాక్సినేషన్ కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళాలన్నారు. జిల్లా అసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వ్యాక్సిన్ల సరఫరా కనుగుణంగా 45 సం. లోపు వారికి వ్యాక్సినేషన్ పై గౌరవ ముఖ్యమంత్రి గారు విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రానికి రెమిడెసివిర్ ను అధికంగా కేటాయించాలని కోరామన్నారు. రాష్ట్ర అవసరాల మేరకు మందులు , టెస్టింగ్ కిట్లు , PPE కిట్లు, మాస్కులు అందుబాటులో వున్నాయన్నారు. జిల్లాలలోను కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయని ప్రజలు వాటిని వినియోగించుకోవాలన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి కూడా పేషంట్లు చికిత్స కోసం వస్తున్నారని , హైదరాబాద్ మెడికల్ ట్రీట్ మెంట్ క్యాపిటల్ గా మారిందని , గత 15 రోజులల్లో ఇతర రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నుండి 33 మెడికల్ ఎయిర్ అంబులెన్స్ లు చికిత్స కోసం వచ్చాయన్నారు.

ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి మరియు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ శ్రీ అర్వింద్ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ S.A.M.రిజ్వి, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.జి.శ్రీనివాస రావు మరియు వైద్య విద్య డైరెక్టర్ డా.రమేశ్ రెడ్డి లు పాల్గొన్నారు.


  జారీచేసినవారు కమీషనర్, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం
Tags: covid out patient wardsCOVID-19Governament of TelanganaHyderabadTelanganavacsin
TP News

TP News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
News

మన్నేగూడా లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

by TP News
27/01/2023
0

వికారాబాద్ మన్నెగూడ లో ఎస్సీ వాడ మహారాజా కాలనీ లో 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మన్నెగూడ ఎంపీటీసీ ఆదిల్ అవిష్కరణఅనoతరం...

Read more
సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

సేవా పతకo అందుకున్నా మహమ్మద్ గౌసూద్ధిన్

26/01/2023
అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

అల్లాపూర్ లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభం

24/01/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News