- దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
- పట్టపగలే 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఒక వితంతువు లంబాడి మహిళ నివాసాన్ని కూల్చేసిన రియల్ ఎస్టేట్ కబ్జాకోరులు
- విషయం తెలుసుకున్న సీఐ రమణ రెడ్డి వెంటనే స్పందించి ఎఫ్ఐర్ నమోదు , లంబాడి మహిళలకు అండగా నిలిచిన దుండిగల్ సీఐ రమణ రెడ్డి
- ఇల్లును కూల్చినది కోనేరు బాలాజీ మరియు అతని అనుచరులు అని మహిళ రోదిస్తూ ఆవేదనతో చెబుతున్న విషయం..
మేడ్చల్ : కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టేందుకు కోనేరు బాలాజీ తన అనుచరులతో వచ్చి, ఖాళీగా ఉన్న భూముల మీద కన్నేసి, కబ్జాలు చేస్తూ, అడ్డొచ్చిన స్థానికులను, పిల్లల్ని, ఒంటరి మహిళల్ని అందరిని చంపేస్తానని బెదిరిస్తూ, ఎవరు లేని టైం చూసి ఒంటరి మహిళల మీద దాడులకు తెగబడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్న సంగతీ వెలుగులోకొచ్చింది… ఇక వివరాలలోకి వెళ్తే…
మేడ్చల్ జిల్లా లోని, కుత్బుల్లాపూర్ మండలం, సూరారం ప్రధాన రహదారి, సాయిబాబా టెంపుల్ ఎదురుగా,వెంకట్రాంరెడ్డినగర్.ప్లాట్ నె: 7 & 40లో శ్రీమతి రేకవత్ లక్ష్మి నాయాక్ , భర్త కీర్తి.శే. రేకవత్ రామ కృష్ణ నాయక్, లంబాడీ కుటుంబానికి చెందిన వితంతువును. గత 50 సం” క్రిందట గృహం నిర్మాణం చేసుకొని నివాసం ఉంటూ, అక్కడే సాయి బాబా టెంపుల్ ముందట పూల వ్యాపారం చేస్తూ జీవనోపాధి గడుపుతోంది.
గత కొన్ని రోజులుగా కొందరు స్థానిక రౌడీ లతో వచ్చి, బెదిరించి, తిట్టి , కోట్ల రూపాల భూమి నీకు ఎంధుకు అని కులం పేరు తో ధూశించి, ని ప్రాణంలు తీస్తా అంటూ ఈ భూమి నుండి కాళీ చేయాలని దౌర్జన్యం చేస్తూ, కొన్ని రోజులగా కోనేరు బాలాజీ మరియు అతని అనుచరులు బెదిరిస్తున్నారు.. ఒక నెల కిందట ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి కిరోసిన్ పోసి ఇల్లును కూడా తగలబెట్టారు అని తన బాధతో లక్ష్మీ నాయక్ తెలియజేసింది.
ఆ తరువాత మళ్లీ అప్పు చేసి మరీ తన ఇల్లును బాగు చేసుకున్నా కూడా, సహించలేని కొందరు కబ్జాదారులు ఎలాగైనా ఈ మహిళను రోడ్డు మీదికి లాగాలి, ఈ భూమిని కబ్జా చేయాలని బలమైన సంకల్పబలంతో ఈ సారి గట్టి ప్రయత్నమే చేశారు. మహిళ అక్కడ లేని సమయాన్ని చూసి,తను ఊరికి వెళ్ళేన సమయం లో 08-05-2021 రోజున పట్టపగలు సమయం మధ్యాహ్నం 3 గంటలకు జెసిబిలతో భూమి మీదకి వచ్చి తను యాభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంటిని, ఒక గంట వ్యవధిలో పది మంది రౌడీలతో ఆయుధాలతో వచ్చి కూల్చేశారు అని స్థానికులు తెలియజేశారు. ఆ విషయాన్ని స్థానికులు ఆ మహిళకు తెలియజేసిన వెంటనే తిరిగి వచ్చి రోధిస్తు ,నేను లేని సమయంలో నా ఇల్లు ను కూలకొట్టి, నెల మట్టం చేసి నా ఇంటి లో విలువైన వస్తువులు, బంగారం మరియు దస్తావేజులు దొంగిలించి, నన్ను రోడ్ మీద వేశారు అని బోరుమంది. ఇలాంటి దుస్తుతి ఎవరికి రాకూడదని, కరోనా తో, పనులు లేక విల విల లాడుతున్న సమయంలో ఇలా చెయ్యడం అన్యాయం అని విలపించింది..
50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను, నా భర్త దహన సంస్కారాలు ఇక్కడే నుండి చేశాను. నేను ఒంటరి మహిళని, లంబాడీ కుటుంబానికి చెందిన వితంతువును అని చూడకుండా, చట్టాన్ని తమ చేతి లోకి తీసుకొని, నా ఇల్లు ను కూలకొట్టి, నెల మట్టం చేసి నాఇంటిలో విలువైన వస్తువులు, బంగారం దస్తావేజులు, దొంగిలించి, నేను స్వేచ్చ్ గా బ్రతకడం నా ప్రాధమికీయ హక్కు, దాన్ని వీరు కాలరాస్తున్నారు. వితంతువును అని జాలి కూడా లేకుండా, ఇంటింలోని వస్తువులను బంగారం, డబ్బు మరియు ఇతర దస్తావేజులు దొంగిలించి, అప్పు చేసి కట్టుకున్న నా ఇల్లును కూల్చారు అని రోదిస్తూ తెలియజేసింది.
అక్కడ స్థానికులు కూడా అందరూ తనకు మద్దతు తెలియజేయడం జరిగింది, ఈ ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ ఐ విటల్ నాయక్ ఈమె పై తిరిగి కేసు పెడతానని బెదిరించాడం శోచనీయం. ఈ విషయం దుండిగల్ సి ఐ రమణ రెడ్డి దృష్టికి వెళ్లిన వెంటనే, ఈ విషయంపై వెంటనే స్పందించి , మహిళలకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన సీఐ, కబ్జా దారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐ రమణ రెడ్డి గారు ఒకవైపు లాక్ డౌన్ ను కఠినంగా నిర్వరిస్తూనే ఉదయం 8 గంటలకు వచ్చి వెంటనే ఎస్ ఐ శ్రీనివాస్ గారిని ఇల్లు కూల్చివేత ఘటనపై పంచనామా చేయడానికి పంపించి , మరి ఆక్కడ స్థానికులతో విషయాన్ని లోతుగా తెలుసుకొని కఠినమైన చర్యలు తీసుకుంటానని తనపై నమ్మకం ఉంచండి అని తెలియజేశారు.
ఒకవైపు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అనేకసార్లు పొజిషన్ లో ఉన్నవారికి పోలీసు వారు రక్షణగా ఉండాలని తెలియజేస్తున్నా కూడా, పట్టపగలే ఒక ఇల్లును నేలమట్టం చేయడానికి వారి వెనుక ఉన్న రాజకీయ అండదండలు, రౌడీయిజం, ఇలా చేయడానికి గల కారణాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తీరుతాయని ఆ మహిళ భావిస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి చీడపురుగుల కబ్జాదారుల పైన వెంటనే పీడీ యాక్ట్ లు పెట్టి జైలుకు పంపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.