- వరంగల్ కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్క్ లో పెట్టుబడి పెట్టనున్న కిటెక్స్
- తొలిదశలో వరంగల్ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపిన కిటెక్స్ ఎండి సాబు ఎం జాకబ్, భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు
- కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్
- గ్రూప్ ప్రతినిధి బృందం ఈరోజు తెలంగాణలో పర్యటించింది.
- తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి వ్యక్తపరిచిన కంపెనీకి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో తెలంగాణకు ఆహ్వానించింది.
- ఈరోజు హైదరాబాద్ చేరుకున్న కంపెనీ ఎండి సాబు జాకబ్ మరియు ఇతర సీనియర్ ప్రతినిధి బృందం మంత్రి శ్రీ కేటీఆర్ తో సమావేశం అయింది
- ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న పరిశ్రమల స్నేహపూర్వక వాతావరణాన్ని, ప్రభుత్వ పాలసీలను వివరించారు
- ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీఎస్ – ఐపాస్ సింగిల్ విండో అనుమతులు, తనిఖీల విధానం, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో సాగుతున్న అత్యుత్తమ కాటన్ పంట వంటి అంశాలను ప్రస్తావించారు.
- కంపెనీ ప్రతిపాదిస్తున్న పెట్టుబడికి తమ టీఎస్ – ఐపాస్ చట్ట ప్రకారం మెగా ప్రాజెక్ట్ హోదా లభిస్తుందని, దీని ప్రకారం టైలర్ మేడ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవకాశం ఉందని కంపెనీకి ప్రభుత్వం తెలిపింది.
- ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి బృందం కీటెక్స్ గ్రూపు కార్యకలాపాలను మంత్రి కేటీఆర్ కు వివరించింది
- తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా కేరళ అవతల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపింది
- తెలంగాణ ప్రభుత్వం తమ కంపెనీ ఆసక్తి/ప్రతిపాదన పట్ల స్పందించిన తీరు పైన ప్రశంసలు కురిపించింది
- ఇంత వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం చాలా అరుదు అన్నది
- ఇక్కడి ప్రభుత్వ విధానాలు, టైక్స్‌టైల్ పరిశ్రమకు ఉన్న అనుకూలతలు తమకు నచ్చాయని తెలిపింది
- తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ లో ఉన్న కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్క్ ను ప్రతినిధి బృందం సందర్శించింది
- ఈ పార్క్ సందర్శన కోసం కంపెనీ ప్రతినిధి బృందంతో టీఎస్ఐఐసి ఎండి నరసింహా రెడ్డి మరియు ఇతర అధికారులు ఉన్నారు
- ఇంత భారీ ఎత్తున దేశంలో ఎక్కడ టైక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు జరగలేదని కంపెనీ అభిప్రాయపడింది
తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ పాలసీలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కీటెక్స్ గ్రూప్ తెలిపింది. ఈరోజు ప్రభుత్వ విధానాలను మంత్రి కేటీఆర్ ద్వారా తెలుసుకున్న మేము వరంగల్ లో పర్యటించి, కాకతీయ టైక్స్‌టైల్ పార్క్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి అక్కడ 1000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంస్థ ప్రకటించింది. వరంగల్ క్షేత్రస్థాయి పర్యటన తర్వాత మరోసారి ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ తో కంపెనీ ప్రతినిధి బృందం మరోసారి సమావేశమైంది. కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీకి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు
తొలిదశలో వరంగల్ టైక్స్‌టైల్ పార్క్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపిన కిటెక్స్ ఎండి సాబు ఎం జాకబ్, భవిష్యత్తులో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు.