సాధించిన విజయాలకు, సంపాదించిన సంపదకు తగిన విలువ దక్కేది అది పది మందికీ పంచినప్పుడే, అభాగ్యుల ఆకలి తీర్చినప్పుడే. ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడకి వెళ్లాలో తెలియదు, ఎటు చూసినా దిక్కుతోచని పరిస్థితి… కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇది అభాగ్యుల దుస్థితి, వేల మైళ్ళ దూరం నుండి పొట్టకూటి కోసం వచ్చిన వలస కూలీలు ఆకలితో అలమటిస్తుంటే కదిలిన హృదయం స్పందించింది, ఆదుకుంది ఆసరాగా నిలబడింది, ఆ హృదయమే, ఆ ఆపన్న హస్తమే శ్రీ గాదె రామ్మోహన్ రెడ్డి గారిది. కన్నబిడ్డల కడుపు నింపేది కన్నతల్లి అయితే, అన్నార్తుల ఆకలి తీర్చేది మన అన్న గాదె రామ్మోహన్ రెడ్డి గారు.
ఇది నిన్నో మొన్నో చేపట్టిన పరోపకార కార్యక్రమం కాదు, ఏళ్ల తరబడి చేస్తూనే ఉన్నారు, ఏళ్ల తరబడి చేస్తూనే ఉంటారు. పువ్వు పుట్టినప్పుడే పరిమళించిన చందంగా వారి దానశీలత వారి దేహంలోనే ఇమిడిపోయి ఉంది, వారి రక్తంలో కరిగిపోయి ఉంది. వారిని కని పెంచిన పుణ్యమూర్తుల నుండి అబ్బిన సంస్కారం అది, వారి గురువుల నుండి నేర్చుకున్న అభ్యుదయం వారిది. గాదె రామ్మోహన్ రెడ్డి గారి నడక, నడత అందరికీ ఆదర్శనీయం, అందరూ అనుసరణీయం.
‘వసుధైవ కుటుంబకం’ అనే భావన వారి అణువణువులో జీర్ణించుకుపోయింది. మతాలన్నీ తనకు సమ్మతమే అనే గొప్ప ఆదర్శానికి శ్రీకారం చుట్టిన గాదె రామ్మోహన్ రెడ్డి గారు సర్వమత సేవాశ్రమాన్ని స్థాపించడం అరుదైన ఘనకార్యం. మతాల మధ్య చిచ్చు పెట్టి మనుషులను విడదీస్తున్న ఈ రోజుల్లో అన్ని మతాలను ఆదరించడం సామాన్యులకు సాధ్యం కాదు, కేవలం మానవాతీత వ్యక్తులకే అది సాధ్యం అవుతుంది అనేది అక్షర సత్యం. అలాంటి అరుదైన మనుషుల్లో ఒక్కరిగా నిలిచిపోయే ‘మనీషి’ గాదె రామ్మోహన్ రెడ్డి గారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత కీర్తించినా కొంత మిగిలిపోయే వ్యక్తిత్వం ఉన్న గాదె రామ్మోహన్ రెడ్డి గారి సహచర్యం మా అదృష్టం. మీతో స్నేహం మాకు తరగని ఆస్తి. ఒక్క మాటలో చెప్పాలంటే, మాకు దేవుడిచ్చిన సోదరులు మీరు.నిండు నూరేళ్లు, అష్టైశ్వర్యాలతో హాయిగా ఆనందంగా మీ జీవనం సాగిపోవాలని ఆ దైవాన్ని ప్రార్ధిస్తూ… మీకు శుభాకాంక్షలు శుభాభివందనాలు.శతమానం భవతి శతాయుః పురుషః శ్శతేంధ్రియ ఆయుఃశ్శేవేంద్రియే ప్రతితిష్ఠతి.
.