నారాయణఖేడ్ : తెలంగాణ రాష్ట్ర, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాణదాతలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం రోజూ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం.. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం తన కళ్ళముందే పోవడం చూసి చలించి పోయినటువంటి “ముజాహెద్ చిస్తీ” కి నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన ఆలోచనకి ప్రతిరూపమే ఈ “ఖేడ్ బ్లడ్ డోనర్స్”…
తను ఒంటరిగా మొదలుపెట్టి ఎంతో మందికి రక్తదానం చెయ్యడమే కాకుండా, తనతో పాటు ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ, ఈ బృహత్కర కార్యక్రమంలో మునీర్, సంతోష్ రావు లతో పాటుగా, మిగతా వారందరినీ భాగస్వామ్యం చేశారు.
ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్నవారు అడిగిన వెంటనే స్పందించి నిస్వార్థంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు మన “ఖేడ్ బ్లడ్ డోనర్స్” సభ్యులు..
ఈ సందర్భంగా “ముజాహెద్ చిస్తీ” మాట్లాడుతూ…
గత నాలుగేళ్లుగా మనమంతా కలిసి చేస్తున్న ఈ బృహత్తర రక్తదానం కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సభ్యులందరి సహకారంతో విజయవంతం చేస్తూ వస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు క్యాంపులు పెట్టినా కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదాతలుగా మారుతున్న సభ్యులందరికీ వందనాలు తెలియజేశారు. ఇదే స్పూర్తితో రేపు ఆగస్టు 15 ఆదివారం ఉదయం 10 గంటలకు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరుగబోయే రక్తదాన శిబిరంలో మనందరం పెద్ద సంఖ్యలో పాల్గొని, రక్తం దొరకక ఇబ్బందులు పడ్తున్న రోగులకు బాసటగా నిలుద్దాం అని ముజ్జు భాయ్ పిలుపునిచ్చారు.
Note : రక్తదానాం చేయాల్సిన వారు ఈ నెంబర్లకు సంప్రదించగలరు
ముజాహెద్ చిస్తీ:-7989894520,
మునీర్:-9000609649,
సంతోష్ రావు:-7780417576
పైన తెలిపిన నెంబర్లకు సంప్రదించగలరు అని మనవి చేశారు.