హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి తెలంగాణ లో 10 రోజుల పాటు లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతీ తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తూన్నారు.
హైదరాబాద్ లో ఎక్కడ చూసినా రోడ్లు జన సంచారం లేక ఖాళీగా కనబడుతున్నాయి. అందులో భాగంగా ఖైరతాబాద్ చౌరస్తా లో రోడ్లన్నీ వాహన దారులు లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు ఈ లాక్ డౌన్ ని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అవసరమైతే తప్ప బయటికి రావడం లేదు.
పోలీసులు కూడా చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు కూడా వారికి సహకరిస్తున్నట్లు చెపుతున్నారు. ఈ లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే అతి తొందరలో తెలంగాణ లో కరోనా ఖతం అవ్వడం ఖాయం అంటున్నారు