యాదాద్రి భువనగిరి :తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఇక భోజనం చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
భోజనాలు ఎలా ఉన్నాయని అడిగారు. కేసీఆర్ ఒక సామాన్యుడిలా వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజన ఏర్పాట్లు చేశారు. వాసాలమర్రిలోని కోదండ రామాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
23 రకాల వంటకాలు..
వాసాలమర్రి గ్రామస్తులకు 23 వంటకాలను వడ్డించారు. మటన్, చికెన్, ఆకుకూరలు, బోటీ కర్రి, చేపలు, తలకాయ కూర, కోడిగుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్ పన్నీరు, బిర్యానీ, పులిహోర, సాంబార్, పండ్ల రసాలు, ఆలుగడ్డతో పాటు పలు వైరెటీలు చేశారు.