ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. ఛాతీ సిటీ స్కాన్ సహా సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సాధారణంగానే తన వాహనంలో ముందు సీట్‌లో కూర్చొని రావడం విశేషం. కారు దిగాక ఆస్పత్రి సిబ్బందితో, అక్కడ ఉన్న మీడియా వారితో దూరం నుంచి అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.
సీఎంకు కరోనా సోకిన వెంటనే ఆయన సతీమణి శోభతో పాటు, ఎమ్మెల్సీ కవిత కూడా ఫాంహౌజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఉదయం ఫామ్ హౌస్ లో వాకింగ్ చేస్తూ చాలా ఉషారుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం వైద్య నిపుణులతో పాటు, యశోద ఆస్పత్రికి సంబంధించిన వైద్య నిపుణులు కూడా నిరంతరం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు యశోద ఆస్పత్రికి సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మొబైల్ వ్యాన్‌ను కూడా ఫాంహౌజ్‌లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఈరోజు కేసీఆర్ గారు ఉషారుగా కనిపించిన తీరు చూస్తుంటే ఆయన అతి త్వరలో ఆరోగ్యంగా ప్రగతి భవన్ కి వస్తారు అనే నమ్మకం కలుగుతుంది. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ తిరిగి ఫామ్‌హౌజ్‌కి బయలుదేరి వెళ్తారు.