బీసీ దళ్: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కొరకు బీసీలకు సాధికారత, సంక్షేమం పై కెసిఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొని కీలకపాత్ర పోషించి, ప్రాణాలు సైతం త్యాగాలు చేసింది బీసీ బిడ్డలే అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గుర్తుచేసుకోవాల్సిన సందర్భం ఏర్పడిందన్నారు.
అల్ పార్టీ మీటింగ్ లో దళిత్ ఎంపౌర్మెంట్ కోసం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తూ, అదేవిధంగా బీసీల సాధికారిత గురించి కూడా ఆలోచించి, బీసీలకు వెంటనే 10 వేల కోట్ల కేటాయించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు.
బీసీల సమస్యలపై న్యాయం చేస్తాం అని హామీలు ఇచ్చినటువంటి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, వెంటనే వాటిని పరిష్కరించి బీసీలకు న్యాయం చేయాలని కుమారస్వామి కోరారు. బీసీలకు వెంటనే లోన్లు ఇవ్వాలని, రాబోయే రోజులలో బీసీల సాధికారిక అంశంపై బీసీ దళ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తము అని బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి తెలియజేశారు.