గోదావరి పరివాహక ప్రాంతంలో గ్యాప్ ఆయకట్టు లేకుండా అధికారులు సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో మంత్రులు ,ఇంజనీరింగ్ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాగునీటి రంగం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
బాల్కొండ ,జగిత్యాల ,ధర్మపురి, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ ,మానకొండూర్, పెద్దపల్లి, రామగుండం ,మంథని నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ , నీటి సౌలభ్యం ఉన్న చోట చిన్న లిఫ్ట్ లు పెట్టుకుని గ్యాప్ లు పూర్తి చేయాలన్నారు.
సకాలంలో నిర్దేశిత ఇరిగేషన్ పనులు పూర్తి చేయని గుత్తేదారు లను తొలగించి, వెంటనే తిరిగి టెండర్ లు పిలిచి కొత్త గుత్తేదారు లకు పనులు అప్పగించి
త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.
సిరిసిల్ల లోని మురుగు నీరు మధ్య మానేరు జలాశయంలో కలవకుండా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ను సిద్ధం చేయాలనీ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాలోని వేములవాడ, కరీంనగర్ రామగుండం,పెద్ద పల్లి, గోదావరి ఖని తదితర పట్టణాల లో డ్రైనేజీ వ్యవస్థ, డిస్పో జల్ వ్యవస్థ ను అభివృద్ధి పరచా లన్నారు. పట్టణాల లోని
మురుగు జలాలను సమీప వాగుల ద్వారా
చెక్ డ్యాం ల వద్దకు తీసుకెళ్ళి శుద్ది చేసి ప్రక్కనున్న ఆయకట్టుకు ఆ జలాలను ఉపయోగించు కోవాలన్నారు. ఆదిశగా ప్రణాళిక లు సిద్ధం చేయాలని రామగుండం ENC వెంకటేశ్వర్లు, కరీంనగర్ ENC శంకర్ లను ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా ఇంచార్జీ మంత్రులు, MLC లు, ఎమ్మెల్యే లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుని గ్యాప్ ఆయకట్టు ఉండకుండా అనువైన సోర్స్ ను గుర్తించాలని సూచించారు.
మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శ్రీ రజత్ కుమార్, ENC శ్రీ హరిరాo, CE sudhakar, జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్, జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రీ అమరేందర్ రెడ్డి, ప్యాకేజీ 9 ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.