ప్రగతి భవన్ : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతున్నది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో వర్షపాతం నమోదు తీరును, ఎస్సారెస్పీపై నుంచి మొదలుకుని కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజ్ ల పరిధిలో వరద పరిస్థితిని, కృష్ణ ఎగువన పరిస్థితిని అధికారులు సీఎం కేసేఆర్ కు వివరించారు. గోదావరికి వరద పెరుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎస్ సహా నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more