ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సీఎం ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. సీఎం ఆదేశాలతో పూర్తి నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.
వకుళాభరణం దారెటు?
వకుళాభరణం దారెటు డాక్టర్ వకుళాభరణం రాజకీయ భవిష్యత్తుపై చర్చోపచర్చలు డాక్టర్ వకుళాభరణం దారి బిఆర్ఎస్ లో కొనసాగుతారా?, కాంగ్రెస్ పార్టీలో చేరతారా?, బిజెపి వైపు వెళతారా? డాక్టర్...
Read more