అడ్డ గూడూరు: తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి జిల్లా,
అడ్డ గూడూరులో అన్యాయంగా మరియమ్మను హింసించి లాకప్ డెత్ చేసిన సందర్భం గురించి సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ, దళిత మహిళను ఏవిధంగా కొట్టి చంపుతారు అని ప్రశ్నించారు. జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు అయింది కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా పాశవికంగా ఉందంటు మండిపడ్డారు. గతంలో ఆత్మకూరు మండలం పల్లెర్ల లో స్వాతి నరేష్ కుల దురహంకార హత్యలు జరగగా, సిపిఐఎం, పోరటం చేస్తే, అక్కడ ఉన్న ఎస్ ఐ ని సస్పెండ్ చేశారు.
అలాగే యాదగిరిగుట్టలో హాజీపూర్లో చిన్న పిల్లల హత్యలో వివరించిన తీరు ప్రభుత్వం అందరికి తెలిసిందే కాబట్టి సిపిఐఎం పార్టీ తరఫున జాహింగిర్ మూడు డిమాండ్లు ప్రతిపాదించారు.
- బాధ్యులు అయినటువంటి పోలీస్ అధికారులను వెంటనే సర్వీస్ నుండి తొలగించాలి.
- హత్యా నేరం కింద ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలి
- ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ హర్షించదగినదిగా లేనందున, ఐదు కోట్ల రూపాయలు మరియమ్మ కుటుంబానికి చెల్లించాలని సిపిఐఎం పార్టీగా ఎండీ జహింగిర్ డిమాండ్ చేశారు.