చెన్నూరు: చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, శ్రీ బాల్క సుమన్ తండ్రి, శ్రీ బాల్క సురేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన సురేశ్, టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యే సుమన్ ను సీఎం ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.