హైదరాబాద్: ప్రగతి భవన్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే కరోనా కేసులు, లాక్‌డౌన్‌పై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతనన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్ పొడగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. కరోనా ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడగించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ పొడగింపుపై రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాల ప్రభుత్వాలు జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించవచ్చునని సూచించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోనుంది.