యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పర్యటించారు. దళిత వాడల్లో పర్యటిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తూ మీకు పెన్షన్ వస్తున్నదా అని ఆరా తీసారు. పెన్షన్ రానివాళ్ళు ఏవరైనా వుంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతిని ఆదేశించారు. దళిత వాడల్లో మట్టి గోడల మీద కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. కొన్ని ఇండ్లలో ఇంటిలోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బంధు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే మంచి ఆలోచనలు చేయాలని సీఎం వారికి సూచించారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more