ఆత్మకూరు (తొలిపలుకు న్యూస్): తెలంగాణ రాష్ట్ర, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కల్లూరి ఆంజనేయులు, ఈరోజు జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఆత్మకూరు(యం) పోలీస్ స్టేషన్ కి సంభందించిన 13 కేసుల కక్షి దారులతో మాట్లాడి, రాజీ చేయించి కేసులను కొట్టివెయించినందుకు గాను ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గండికోట మధు గారు, కల్లూరి ఆంజనేయులుని రివార్డుతో అభినందించారు. ఈ సందర్భంగా కల్లూరి ఆంజనేయులు మాట్లాడుతూ.. కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుంది, ఎవరు కూడా అనవసర ఆవేశాలకు పోయి, ఇతరులకు ఇబ్బంది కలిగించి కేసులపాలు అయ్యి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు అని తెలిపారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more