దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి.రమణ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో రేపు ఉదయం 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ ఎన్.వి.రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యే అవకాశముంది.
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more