జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు బుధవారం రాతపరీక్ష జరుగనున్నది. 9,355 పోస్టులకు 5,62,424 మంది దరఖాస్తు చేసుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,288 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్, పోలీస్, జేఎన్టీయూ, ట్రెజరీ, విద్యుత్‌శాఖల సహకారంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాతపరీక్షకు సర్వం సిద్ధంచేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలవరకు రెండో పేపర్ పరీక్ష ఉంటుంది. పరీక్ష పత్రాల్లో జంబ్లింగ్ కోడ్ పద్ధతిని పాటిస్తున్నారు.