వృత్తే దైవంగా భావించే మహోన్నతమైన వ్యక్తి జేటీసీ పాండురంగ నాయక్: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ గారిని కలిశారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. 33 సంవత్సరాల వృత్తిని పూర్తీ చేసుకున్న పాండురంగ నాయక్ గారిని అభినందించారు దుండ్ర కుమారస్వామి. వృత్తే దైవంగా భావించి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి పాండురంగ నాయక్ అని అన్నారు. ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎన్నో వాహనాలను రోడ్డు నుండి తప్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోటారు వాహన చట్టం అమలయ్యేలా ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారు. స్కూల్ పిల్లల బస్సు ట్రాన్స్ పోర్టుకు సంబంధించి ఎన్నో మార్గదర్శకాలను అమలు చేశారు.
తన సేవలతో మండల, జిల్లా స్థాయి పలు పురస్కారాలు సైతం అందుకున్నారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్. అంతేకాకుండా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పాండు నాయక్ అని కొనియాడారు దుండ్ర కుమారస్వామి. ఎక్కడ పని చేసినా తనదైన ముద్ర వేసుకున్నారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్. 33 సంవత్సరాల పాటూ విధులు నిర్వర్తిస్తూ వస్తున్న పాండురంగ నాయక్ తన సర్వీస్ లో ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచారు. చాలా మంది ఎదుగుదలకు తోడ్పాటును అందించారు. ఆదిలాబాద్ లో ఆర్టీవో గా మొదలైన ఆయన ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్థాయికి ఎదిగింది. తన ప్రయాణంలో ఎంతో మందికి అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు.