జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి (National president BC Dal Dundra kumara Swamy)
తొలి బహుజన పోరాట యోధుడు- సర్దార్ పాపన్న గౌడ్
జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
సర్దార్ పాపన్న గౌడ్ విరోచిత పోరాటాన్ని జీవిత చరిత్రను పాఠ్యాంశం లో పెట్టాలి
తెలంగాణ ఆత్మగౌరవ పతాక సర్దార్ పాపన్న గౌడ్ అని జతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు విరోచితంగా పోరాడి సర్దార్ పాపన్న గౌడ్ చరిత్రలో నిలిచిపోయారని నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు సర్దార్ పాపన్న గౌడ్ 374 వ జయంతి వారోత్సవాలు పురస్కరించుకొని జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి తన పోరాట పటిమతో శత్రుముకులను గడగడలాడించారని స్పష్టం చేశార మొగులై సామ్రాజ్యవాదం పాలను అంతమొందించేందుకు తన సైన్యంతో విరోచితంగా పోరాట చేసిన చక్రవర్తిని కొనియాడారు. భోజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, కిలాసాపురంలో జన్మించిన పాపన్న గౌడ్ భువనగిరి కోటగా సుభిక్షమైన పరిపాలన సాగించి ఆనాటి ప్రజలచే జేజేలు పలికించుకున్నారని దుండ్ర కుమారస్వామి గుర్తు చేశారు. భువనగిరి కోటగా మంచి పరిపాలన అందిస్తూనే గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని అక్కడి నుండి కేంద్ర రాజ్యాంగ సుభిక్ష రాజ్యాంగ ప్రజలం బాగోగులు చూసుకుంటూ సుపరిపాలన ఆ రోజుల్లోనే సర్దార్ పాపన్న గౌడ్ సాగించారని ఆయన స్పష్టం చేశారు .మొగలై సామ్రాజ్యవాదులను ఎదిరించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకొని ఔరంగాజేబుపై తన సైన్యంతో పట్టు విడవని విక్రమార్కుడు యుద్ధం చేశారని ఆయన స్పష్టం చేశారు నేటి తరాలకు సర్దార్ పాపన్న గౌడ్ ఆదర్శంగా చరిత్ర పుటల్లో మిగిలిపోయారని ఆయన పేర్కొన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి కుమారస్వామి విన్నవించారు. సర్దార్ పాపన్న గౌడ్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది అభివృద్ధి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని దుండ్ర కుమారస్వామి సూచించారు అంతేకాకుండా సర్దార్ పాపన్న గౌడ్ విరోచిత పోరాటాన్ని జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టి విద్యార్థులకు బోధించాలని ఆయన కోరారు