పీర్జాదిగూడ : మంగళవారం రోజున మూడుచింతలపల్లిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఈ రోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి పిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ స్లొగన్స్ ఇస్తూ దీక్షల పేరుతో మంత్రి మల్లారెడ్డి గారిని ఇష్టానుసారంగా బూతులు తిట్టడం మానుకోవాలని, వెంటనే రేవంత్ రెడ్డి మంత్రిగారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.