శేర్లింగంపల్లి: కరోనా మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోతుండటంతో వారి కుటుంబాలకు అండగా ఉండాలనే సేవా దృక్పథంతో, కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలలో ధైర్యం నింపుతూ మీకు మేమున్నాం అంటూ, శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ 124 భాగ్యనగర్ కాలనీ లోని జై భారతమాత సేవా సమితి ముందుకొచ్చింది.
ఈ నేపథ్యంలో 150 మందికి 25 కేజీల చొప్పున బియ్యం, 7 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జై భారతమాత సేవా సమితి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లగ్దే నాగరాజు, జనరల్ సెక్రెటరీ ఎర్రవల్లి ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ మనోళ్ల విట్టల్, ట్రెజరర్ M జయశ్రీ , తదితరులు పాల్గొన్నారు.