హైదరాబాద్ నెగటివ్ మార్కులతో ప్రశ్నాపత్రాలు ఇవ్వటం వల్ల దళిత, గిరిజన విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని గతంలో నిర్వహించినట్టుగానే ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ. విద్యార్థులకు మార్కుల్లో రాయితీ ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. ఈ పద్ధతిని అమలు చేయకుండా ఓబీసీలకు 80 శాతం నుంచి 60 శాతానికి కటాఫ్ మార్కులు తగ్గింటమేంటని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు అదే మోతాదులో 60 శాతం నుంచి 40శాతానికి తగ్గించి, వెయిటేజీ మార్కులు ఇవ్వకపోవటం అన్యాయమని పేర్కొన్నారు. దీంతో దళిత, గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. అభ్యర్థులు నాలుగేండ్ల నుంచి అనేక కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి చదువుకున్నారని తెలిపారు. సబ్జెక్టుల వారీగా కాకుండా మిడిమిడి జ్ఞానంతో ప్రశ్న పత్రాలు ఇచ్చినట్టుగా ఉన్నదని విమర్శించారు. ప్రశ్నాపత్రంలో 22 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో ప్రభుత్వం పెట్టే ఐదు రూపాయల భోజనం తిని చదువుకున్న విద్యార్థులు ఉన్నారని రంగరెడ్డి జిల్లా గిరిజన మూర్ఛ ప్రధాన కార్యదర్శి జగదీశ్ కుమార్ గుర్తు చేశారు.
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు
రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం,...
Read more