శ్రీ హరి కోటల ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ45 ప్రయోగం విజయవంతమైంది. ఇది ఇమిశాట్ సహా 28 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళుతుంది. విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్‌డీఓ రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఈఎంఐఎస్‌ఏఐటీ (ఇమిశాట్)ను ఇది కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇవాళ ఉదయం 9.27 నిమిషాలకు నింగిలోకి దూసుకువెళ్లింది.
విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్‌డీవో రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్‌ఏటీ(ఇమిశాట్)ను పీఎస్‌ఎల్‌వీ సీ45 కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో పాటు అమెరికాకు చెందిన 24 ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో శాటిలైట్‌ను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
పీఎస్‌ఎల్‌వీ సీ-45 వాహకనౌక ఈరోజు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు ఇండిగో విమానానికి చెందిన పైలట్ వీడియోను తీశారు. ఈ ప్రయోగ సమయంలో ఇండిగో విమానం ప్రయోగ కేంద్రానికి 50 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్ కెప్టెన్ కరుణ్ కారుబయా.. నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్ వీడియో తీశారు. దానిని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్.. విమానం కుడి వైపు ఉన్న కిటికీ నుంచి పీఎస్‌ఎల్‌వీ శాటిలైట్ లాంచ్‌ను మీరూ చూడొచ్చు. అది మన రాకెట్టే..’ అని ప్రయాణికులకు చెప్పారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ‘బ్యూటీ.. వావ్.. అమేజింగ్..’ అంటూ కేకలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.